గురువారం 26 నవంబర్ 2020
Sports - Nov 19, 2020 , 00:55:47

ఇంగ్లండ్‌లో భారత్‌ పర్యటన ఖరారు

 ఇంగ్లండ్‌లో భారత్‌ పర్యటన ఖరారు

2021 టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌ విడుదల 
లండన్‌: కరోనా కష్టకాలంలో క్రికెట్‌ను పునరుద్ధరించి తొలిసారి బయో బబుల్‌లో సిరీస్‌లు నిర్వహించడంలో విజయవంతమైన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ).. వచ్చే ఏడాది భారత పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఆగస్టు-సెప్టెంబర్‌ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌కు ఆతిథ్యమివ్వనున్నట్లు బుధవారం స్పష్టం చేసింది. అప్పటిలోపు కరోనా ప్రభావం ఉండకపోతే.. ప్రేక్షకుల మధ్యే ఈ సిరీస్‌ నిర్వహించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఆగస్టు 4న ట్రెంట్‌బ్రిడ్జ్‌ టెస్టుతో ప్రారంభమయ్యే ఈ సిరీస్‌.. సెప్టెంబర్‌ 10 మాంచెస్టర్‌ మ్యాచ్‌తో ముగియనుంది. కాగా ఇంగ్లండ్‌ జట్టు 16 ఏండ్ల తర్వాత వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో పర్యటించనుంది.