శనివారం 28 మార్చి 2020
Sports - Feb 27, 2020 , 00:51:21

టాప్‌ చేజారే..

టాప్‌ చేజారే..

దుబాయ్‌: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. హామిల్టన్‌ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తక్కువ స్కోరుకే వెనుదిరిగిన విరాట్‌ 906 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరాడు. చాన్నాళ్ల తర్వాత ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (911) తిరిగి టాప్‌ ప్లేస్‌ దక్కించుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో విలియమ్సన్‌ (3) ఓ స్థానం మెరుగుపరుచుకోగా.. ఆసీస్‌ నయా సంచలనం మార్నస్‌ లబుషేన్‌ ఓ స్థానం కోల్పోయి 4వ ర్యాంక్‌కు చేరాడు. కోహ్లీతో పాటు భారత్‌ నుంచి అజింక్యా రహానే (8), చతేశ్వర్‌ పుజారా (9), మయాంక్‌ అగర్వాల్‌ (10) టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. 


logo