సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Feb 12, 2020 , 13:57:46

ఇండోపాక్ సిరీస్ ఉండాలి: యువ‌రాజ్ సింగ్‌

ఇండోపాక్ సిరీస్ ఉండాలి:  యువ‌రాజ్ సింగ్‌


హైద‌రాబాద్‌:  భార‌త్‌, పాక్ మ‌ధ్య ఎప్పూడు క్రికెట్ టోర్నీలు జ‌రుగుతూనే ఉండాల‌ని రెండు దేశాల‌కు చెందిన మాజీ క్రికెట‌ర్లు అభిప్రాయ‌ప‌డ్డారు. మాజీ ఆల్ రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్‌, పాక్ హిట్ట‌ర్ షాహిద్ అఫ్రీదిలు ఈ అభిప్రాయాన్ని వినిపించారు.  క్రీడ‌ల మీద ఉన్న మ‌క్కువ‌తోనే క్రికెట్ ఆడుతున్నామ‌ని,  ఏ దేశంతో క్రికెట్ ఆడాల‌న్న ఉద్దేశాన్ని చూడ‌వ‌ద్దు అని, కానీ భార‌త్‌, పాక్ మ‌ధ్య నిత్యం మ్యాచ్‌లు ఉంటేనే, అది ఆట‌కు మంచి జ‌రుగుతుంద‌ని యువ‌రాజ్ అభిప్రాయ‌ప‌డ్డాడు. న్యూఢిల్లీలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో యువీ.. ఇండో పాక్ సిరీస్‌ల‌పై త‌న మ‌నోభావాన్ని వినిపించాడు.  పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఎక్కువ‌గా ఉంటేనే.. దాని వ‌ల్ల‌ ఆట‌కు మేలు జ‌రుగుతుంద‌న్నాడు.  2004, 2006, 2008 సంవ‌త్స‌రాల్లో పాక్‌తో ఆడిన మ్యాచ్‌ల‌ను అత‌ను గుర్తు చేసుకున్నాడు. ఈ రోజుల్లో అలాంటి మ్యాచ్‌లే లేవ‌న్నాడు. పాక్ మాజీ కెప్టెన్ అఫ్రీది కూడా ఇదే అభిప్రాయాన్ని వినిపించాడు.  ఒక‌వేళ ఇండియా, పాక్ ఆడితే.. అప్పుడు అది యాషెస్ కంటే పెద్ద సిరీస్ అవుతుంద‌ని అఫ్రీది అన్నాడు. క్రికెట్ ఆట‌లో రాజ‌కీయాల‌కు తావు ఇవ్వ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తిన‌ట్లు అత‌ను అభిప్రాయ‌ప‌డ్డాడు. ఈ విష‌యం గురించి రెండు దేశాలు మాట్లాడుకుంటే బాగుంటుంద‌న్నాడు. 

 logo