శనివారం 16 జనవరి 2021
Sports - Dec 26, 2020 , 13:05:21

మెల్‌బోర్న్ టెస్ట్ : ఇండియా 36-1

మెల్‌బోర్న్ టెస్ట్ : ఇండియా 36-1

 హైద‌రాబాద్‌:  మెల్‌బోర్న్ టెస్టులో తొలి రోజు భార‌త్ పైచేయి సాధించింది. ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ వికెట్ న‌ష్టానికి 36 ర‌న్స్ చేసింది.  గిల్ 28, పూజారా 7 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.  ఉద‌యం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 72.3 ఓవ‌ర్ల‌లో 195 ర‌న్స్‌కే ఆలౌటైంది.  భార‌త బౌల‌ర్లు మెల్‌బోర్న్‌లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు.   తొలి సెష‌న్‌లో స్పిన్న‌ర్ అశ్విన్ ఆసీస్ ప్లేయ‌ర్ల‌ను ఇబ్బందిపెట్ట‌గా.. ఆ త‌ర్వాత సెష‌న్‌లో స్పీడ్‌స్ట‌ర్ బుమ్రా త‌న మార్క్ చాటాడు.  ఇక తొలి టెస్టు ఆడుతున్న హైద‌రాబాదీ ప్లేయ‌ర్ సిరాజ్‌.. రెండు వికెట్లు తీసుకున్నాడు.  కీల‌క‌మైన ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌ను అత‌ను ఔట్ చేశాడు.  బుమ్రా నాలుగు, అశ్విన్ మూడు, సిరాజ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.  ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ల‌లో ల‌బుషేన్‌ అత్య‌ధికంగా 48 ర‌న్స్ చేశాడు.  వేడ్ 30, హెడ్ 38 ర‌న్స్ చేశాడు.  

తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియాకు తొలి ఓవ‌ర్‌లోనే షాక్ త‌గిలింది.  50 నిమిషాల ఆట కోసం మైదానంలోకి దిగిన భార‌త్‌కు.. మిచెల్ స్టార్క్ త‌న స్వింగ్‌తో అద‌ర‌గొట్టాడు.  ఇన్నింగ్స్ మొద‌టి ఓవ‌ర్‌లోనే అగ‌ర్వాల్‌ వికెట్‌ను తీశాడు. మ‌యాంక్ అగ‌ర్వాల్ డ‌కౌట్ అయ్యాడు. అయితే మ‌రో ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్  ఉత్త‌మ ఆట‌ను ప్ర‌ద‌ర్శించాడు. గిల్ 28 ర‌న్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు.  పుజారా కూడా క్రీజ్‌లోనే ఉన్నాడు.  గిల్‌, పుజారాలు ఆసీస్ బౌల‌ర్ల ధాటిని స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నారు.  గిల్ ఇన్నింగ్స్‌లో అయిదు బౌండ‌రీలు ఉన్నాయి.