శుక్రవారం 22 జనవరి 2021
Sports - Jan 03, 2021 , 16:31:12

టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దు

టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దు

మెల్‌బోర్న్‌: మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌(ఎంసీజీ)లో  టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌ సెషన్‌ వర్షం కారణంగా రద్దైంది. దీంతో భారత ఆటగాళ్లు ఇండోర్‌ స్టేడియంలో సాధన చేశారు. ఔట్‌డోర్‌ ప్రాక్టీస్‌ లేకపోవడంతో జిమ్‌లోనే చెమటోడ్చారు.  వర్షం కారణంగా ఎంసీజీలో ఇవాళ భారత జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దు చేయబడిందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

సోమవారం సిడ్నీకి బయలుదేరే ముందు భారత్‌, ఆస్ట్రేలియా జట్లు వారాంతంలో ఎంసీజీలో ప్రాక్టీస్‌ చేయాలని నిర్ణయించుకున్నాయి. సిడ్నీ వేదికగా జనవరి ఏడో తేదీ నుంచి భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ఆరంభంకానుంది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. 

ఇవి కూడా చ‌ద‌వండి

కొవిషీల్డ్ వ‌ర్సెస్ కొవాగ్జిన్‌.. ఏ వ్యాక్సిన్ ధర ఎంత‌?

వ్యాక్సిన్ వ‌చ్చేసింది.. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ల‌కు డీసీజీఐ అనుమ‌తి

ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ డౌటే!

దర్శక నిర్మాతలకు థియేటర్లపై ఇంకా నమ్మకం కుదరలేదా..?


logo