ఆదివారం 17 జనవరి 2021
Sports - Jan 07, 2021 , 00:10:27

100ఏండ్ల క్రికెటర్‌ మృతి

100ఏండ్ల క్రికెటర్‌ మృతి

క్రైస్ట్‌చర్చ్‌: ప్రస్తుతం జీవించి ఉన్న వారిలో అత్యధిక వయసు కలిగిన ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ అలాన్‌ బర్గెస్‌ (100) మృతి చెందారు. న్యూజిలాండ్‌కు చెందిన ఆయన సెంటర్‌బరీ తరఫున 1940-41 నుంచి 1951-52 వరకు 11 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లతో పాటు న్యూజిలాండ్‌ సర్వీసెస్‌ తరఫున ఆడారు. ఒటాగోతో జరిగిన అరంగేట్రం మ్యాచ్‌లోనే ఆరు వికెట్లు పడగొట్టి సత్తాచాటారు. అలాగే సైనికుడిగా రెండో ప్రపంచ యుద్ధంలో బర్గెస్‌ యుద్ధ ట్యాంకును నడపడం విశేషం.