గురువారం 21 జనవరి 2021
Sports - Jan 09, 2021 , 16:25:37

జడేజా, పంత్‌లకు ఏమైంది?

జడేజా, పంత్‌లకు ఏమైంది?

సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో ఇద్దరు భారత ఆటగాళ్లు గాయపడ్డారు. టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆటలో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో  వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాలకు గాయాలయ్యాయి. దీంతో వీరిద్దరిని   స్కానింగ్‌ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు బీసీసీఐ తెలిపింది.  ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్‌ పంత్‌ స్థానంలో వృద్ధిమాన్‌ సాహా వికెట్‌ కీపింగ్‌ చేశాడు. ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయపడటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. 

తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో పంత్‌ గాయపడ్డాడు. కమిన్స్‌ వేసిన బంతి పంత్‌ ఎడమ మోచేతికి తగిలింది. నొప్పితో బాధపడుతూనే బ్యాటింగ్‌ చేశాడు. స్వల్ప వ్యవధిలోనే హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో డేవిడ్‌ వార్నర్‌ చేతికి చిక్కి  వెనుదిరిగాడు పంత్‌. మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో  బౌన్సర్‌ను తప్పించుకునేందుకు ప్రయత్నించగా  బంతి  జడేజా  ఎడమచేతి బొటనవేలికి  బలంగా తాకింది. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ సమయంలో జడేజా డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే విశ్రాంతి తీసుకున్నాడు.  


logo