శుక్రవారం 15 జనవరి 2021
Sports - Dec 30, 2020 , 16:57:28

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ నెం.2

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ నెం.2

మెల్‌బోర్న్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో  టీమ్‌ఇండియా మళ్లీ రెండో  స్థానాన్ని  నిలుపుకున్నది. మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్‌   మరో 30 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. మొత్తం 390 పాయింట్లు, 72.2 పాయింట్ల శాతంతో ఛాంపియన్‌షిప్‌ పట్టికలో భారత్‌ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది.

భారత్‌తో రెండో టెస్టులో ఓటమిపాలైన ఆసీస్‌ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ఆస్ట్రేలియా ప్రస్తుతం 322 పాయింట్లు, 76.6 పాయింట్ల శాతంతో ఉంది.  చాంపియన్‌షిఫ్ ఫైనల్‌ జట్లను నిర్ధారించేందుకు ఐసీసీ  పాయింట్ల శాతాన్ని  ప్రకటించింది.  భారత్‌తో రెండో టెస్టులో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా  ఆస్ట్రేలియా  మ్యాచ్‌ ఫీజులో ఐసీసీ 40 శాతం కోత పెట్టిన విషయం తెలిసిందే.   ఆసీస్‌ ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల నుంచి 4 పాయింట్లను కూడా తగ్గించారు.