శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 19, 2020 , 00:02:18

మన్‌ప్రీత్‌ సారథ్యంలోనే..

మన్‌ప్రీత్‌ సారథ్యంలోనే..
  • ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రొ లీగ్‌లో భారత్‌ మూడో పోరుకు సిద్ధమైంది. తొలి ‘టై’లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ నెదర్లాండ్స్‌ను చిత్తుచేసిన భారత్‌.. మలిపోరులో ప్రపంచ చాంపియన్‌ బెల్జియంపై ఓ మ్యాచ్‌ గెలిచి మరో మ్యాచ్‌లో ఓడింది. ఇక ముచ్చటగా మూడో ‘టై’లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఆస్ట్రేలియాతో తలపడనుంది. దీని కోసం హాకీ ఇండియా (హెచ్‌ఐ) మంగళవారం 24 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథిగా.. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ ఉపసారథిగా వ్యవహరించనున్నారు. పీఆర్‌ శ్రీజేశ్‌, కృషన్‌ పాఠక్‌ గోల్‌ కీపింగ్‌ బాధ్యతలు మోయనున్నారు. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం వేదికగా శుక్ర, శనివారాల్లో జరుగనున్న రెండు మ్యాచ్‌ల్లో భారత జట్టు ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గత రెండు ‘టై’ల్లో సత్తాచాటిన ఆటగాళ్లు ఆసీస్‌పై కూడా అదే జోరు కనబరిస్తే.. భారత్‌కు తిరుగుండదని కోచ్‌ గ్రహమ్‌ రీడ్‌ పేర్కొన్నాడు.


logo