సోమవారం 25 జనవరి 2021
Sports - Nov 28, 2020 , 17:16:16

ధోనీలాంటి ప్లేయ‌ర్ టీమిండియాకు కావాల్సిందే!

ధోనీలాంటి ప్లేయ‌ర్ టీమిండియాకు కావాల్సిందే!

సిడ్నీ:  టీమిండియాకు ఇప్పుడు మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీలాంటి ప్లేయ‌ర్ అవ‌స‌ర‌మ‌ని అంటున్నాడు విండీస్ మాజీ పేస్ బౌల‌ర్ మైకేల్ హోల్డింగ్‌. భారీ ల‌క్ష్యాల‌ను ఛేదించాలంటే ధోనీలాంటి సామ‌ర్థ్యం ఉన్న ప్లేయ‌ర్ త‌ప్ప‌నిస‌రి అని హోల్డింగ్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఆస్ట్రేలియాతో తొలి వ‌న్డేలో 375 ప‌రుగుల‌ను ఛేదించ‌లేక 66 ప‌రుగుల‌తో ఓడిన నేప‌థ్యంలో హోల్డింగ్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. ఇండియ‌న్ టీమ్‌లో చాలా మంచి ప్లేయ‌ర్స్ ఉన్నారు. అయితే ధోనీ లేని లోటు మాత్రం కనిపిస్తోంది. ధోనీ మ‌ధ్య‌లో బ్యాటింగ్‌కు దిగిన స‌మ‌యంలో అత‌డు ఛేద‌న‌ను త‌న నియంత్ర‌ణ‌లోకి తీసుకునేవాడు. అందుకే ధోనీ టీమ్‌లో ఉన్న‌పుడు ఇండియా పెద్ద టార్గెట్ల‌ను కూడా సులువుగా చేజ్ చేయ‌గ‌లిగింది. ధోనీ నైపుణ్య‌మే కాదు అంతటి బ‌ల‌మైన వ్య‌క్తిత్వం ఉన్న ప్లేయ‌ర్ అవ‌స‌రం టీమిండియాకు ఉంది అని హోల్డింగ్ స్ప‌ష్టం చేశాడు. ఇండియా చేజ్ చేస్తున్న‌ప్పుడు ధోనీ ఎప్పుడూ భ‌య‌ప‌డేవాడు కాదు. త‌న సామ‌ర్థ్యంపై అత‌నికి న‌మ్మ‌కం ఉంది కాబ‌ట్టి.. ఎంతటి ఛేద‌న‌నైనా ప‌క్కా ప్లానింగ్‌తో చేజ్ చేసేవాడు. అత‌నితో బ్యాటింగ్ చేసేవాళ్ల‌తో త‌ర‌చూ మాట్లాడుతూ.. వారికి సాయం చేసేవాడు. అందుకే ధోనీలాంటి ప్లేయ‌ర్ చేజింగ్‌లో ఉండాలి అని హోల్డింగ్ అన్నాడు. 


logo