బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 08, 2020 , 00:58:48

చావో.. రేవో

చావో.. రేవో
  • నేడు భారత్ ,న్యూజీలాండ్ రెండో వన్డే

టీ20ల్లో ప్రత్యర్థిని వైట్‌వాష్‌ చేసిన టీమ్‌ఇండియా.. తొలి వన్డేలో ఓటమి పాలై ఒత్తిడిలో పడింది. సిరీస్‌లో సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నది. మరోవైపు తమ వన్డే చరిత్రలో అత్యధిక లక్ష్యఛేదనను విజయవంతంగా పూర్తిచేసిన న్యూజిలాండ్‌ ఆక్లాండ్‌లోనే సిరీస్‌ ఒడిసి పట్టాలని భావిస్తున్నది. మొదటి మ్యాచ్‌లో బౌలింగ్‌, ఫీల్డింగ్‌ లోపాల వల్ల ఓటమి పాలైన కోహ్లీ గ్యాంగ్‌.. ఈ మ్యాచ్‌లో వాటిని సరిదిద్దుకొని సత్తాచాటేందుకు రెడీ అయింది. మరింకెందుకు ఆలస్యం  ఉదయం ఏడున్నరకే మ్యాచ్‌ షురూ.. 


ఆక్లాండ్‌: పొట్టి ఫార్మాట్‌లో దుమ్మురేపిన టీమ్‌ఇండియా.. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఓడి ఒత్తిడిలో కూరుకుపోయింది. సిరీస్‌ నెగ్గాలంటే మిగిలిన రెండు వన్డేలు తప్పక గెలువాల్సిన పరిస్థితిలో న్యూజిలాండ్‌తో శనివారం రెండో పోరుకు రెడీ అవుతున్నది. ఇదే జోరు కొనసాగిస్తూ.. సిరీస్‌ చేజిక్కించుకోవాలని కివీస్‌ భావిస్తుంటే.. ఈ మ్యాచ్‌ నెగ్గి సిరీస్‌ సమం చేయాలని విరాట్‌ గ్యాంగ్‌ కృతనిశ్చయంతో ఉన్నది. టీమ్‌ఇండియా స్వదేశంలో ఆడిన గత రెండు సిరీస్‌ల్లో తొలి మ్యాచ్‌లు ఓడాక.. వరుసగా రెండు వన్డేలు నెగ్గి సిరీస్‌ చేజిక్కించుకోవడం గమనార్హం. హామిల్టన్‌ వన్డేలో ఇరు జట్లు చక్కటి ఆటతీరు కనబరిచినా.. తుదికంటా పోరాడిన న్యూజిలాండ్‌ను విజయం వరించింది. ఒక్క ఓటమితో దిగులు చెందాల్సిన అవసరం లేదంటున్న కోహ్లీ.. తిరిగి పుంజుకొని సత్తాచాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కీలక బౌలర్లు వికెట్లు తీయలేకపోవడంతో పాటు ఫీల్డింగ్‌ లోపాలు, అదనపు పరుగులే కొంపముంచాయనుకుంటున్న టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ మ్యాచ్‌లో అలాంటి తప్పిదాలు పునరావృతం కాకూడదని భావిస్తున్నది. మరోవైపు రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ లేకున్నా.. టాపార్డర్‌ సమిష్టిగా రాణించడంతో కివీస్‌ అలవోకగా విజయం సాధించింది. రెండు జట్లు సమరానికి సై అంటున్న తరుణంలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.


సమిష్టిగా సత్తాచాటాలి

మొదటి వన్డేలో నయా ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా శుభారంభాన్నిచ్చినా.. తమదైన మార్క్‌ వేయడంలో విఫలమయ్యారు. ఇప్పటికే టెస్టుల్లో నిరూపించుకున్న ఈ యువ ద్వయం.. ఆక్లాండ్‌లో అదరగొట్టాలని చూస్తున్నది. వన్‌డౌన్‌లో కోహ్లీ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నా.. అతడి బ్యాట్‌ నుంచి సెంచరీ రాక చాన్నాైళ్లెనట్లు అనిపిస్తున్నది. కీలక మ్యాచ్‌ల్లో తనలోని అసలు సిసలు పోరాట యోధుడిని వెలికితీసే విరాట్‌ మరోసారి సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరముంది. ఇన్నాళ్లు టీమ్‌ఇండియాను ఇబ్బందిపెట్టిన మిడిలార్డర్‌.. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నది. నాలుగో స్థానంలో అయ్యర్‌ అదరగొడుతుంటే.. ఆర్డర్‌తో సంబంధం లేకుండా రాహుల్‌ రఫ్ఫాడిస్తున్నాడు. పరిస్థితులకు తగ్గట్లు గేర్లు మారుస్తున్న రాహుల్‌ వికెట్ల వెనుక కూడా చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆల్‌రౌండర్ల కోటాలో జాదవ్‌, జడేజా ఖాయమే. ఎటొచ్చి తొలి మ్యాచ్‌లో భారీగా పరుగులిచ్చిన కుల్దీప్‌, శార్దూల్‌ను పక్కన పెట్టి చాహల్‌, సైనీలకు అవకాశం ఇస్తారా చూడాలి. బుమ్రా, షమీ పరుగులు కట్టడి చేసినా.. మిడిల్‌ ఓవర్లలో వికెట్లు పడగొట్టలేకపోవడం వల్లే గత మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమి పాలైంది. ఈ లోపాలను సవరించుకుంటే.. కివీస్‌ను నిలువరించడం పెద్ద కష్టమేమీ కాదు. శుక్రవారం ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ కావడంతో కోహ్లీ, రాహుల్‌, బుమ్రా, షమీ ప్రాక్టీస్‌కు రాలేదు. శార్దూల్‌, సైనీ, జాదవ్‌, దూబే, పంత్‌, జడేజా, కుల్దీప్‌ నెట్స్‌లో చెమటోడ్చారు.


ఫుల్‌ జోష్‌లో..

తమ వన్డే చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించి మంచి జోరుమీదున్న న్యూజిలాండ్‌ అదే ఊపులో సిరీస్‌ చేజిక్కించుకోవాలని చూస్తున్నది. బ్యాటింగ్‌లో గప్టిల్‌, నికోల్స్‌, లాథమ్‌, టేలర్‌ ఆకట్టుకుంటున్నారు. తొలి వన్డేలో టేలర్‌, లాథమ్‌ ఇన్నింగ్స్‌ల గురించి ఎంత చెప్పినా తక్కువే. గత మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన బ్లండెల్‌, ఆల్‌రౌండర్లు నీషమ్‌, గ్రాండ్‌హోమ్‌ కూడా రాణిస్తే.. కివీస్‌కు తిరుగుండదు. బ్లాక్‌క్యాప్స్‌ బౌలింగ్‌లో అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. సీనియర్‌ పేసర్‌ సౌథీ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. న్యూజిలాండ్‌ క్రికెట్‌లో అత్యంత పొడగరి కైల్‌ జెమీసన్‌ (6 అడుగుల 8 అంగులాలు) ఈ మ్యాచ్‌లో అరంగేంట్రం చేయడం దాదాపు ఖాయమే.


రెండేండ్లుగా మన ఫీల్డింగ్‌ అద్భుతంగా సాగుతున్నది. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీసేన అదరగొట్టింది. అయితే, గతేడాది స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌ నుంచి ప్రమాణాలు పడిపోయాయి. ఫీల్డింగ్‌ సాధారణంగా మారింది. ప్రాక్టీస్‌కు తగినంత సమయం లేకపోవడం కూడా ప్రభావం చూపుతున్నది. 

 -  శ్రీధర్‌, టీమ్‌ ఇండియా  ఫీల్డింగ్‌ కోచ్‌ 


తుది జట్లు (అంచనా)

భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), మయాంక్‌, పృథ్వీ షా, అయ్యర్‌, రాహుల్‌, జాధవ్‌, జడేజా, శార్దూల్‌/సైనీ, కుల్దీప్‌/చాహల్‌, షమీ, బుమ్రా. 

న్యూజిలాండ్‌: లాథమ్‌ (కెప్టెన్‌), గప్టిల్‌, నికోల్స్‌, బ్లండెల్‌, టేలర్‌, గ్రాండ్‌హోమ్‌, నీషమ్‌, శాంట్నర్‌, జెమీసన్‌, బెనెట్‌, సౌథీ. 


పిచ్‌, వాతావరణంపిచ్‌, వాతావరణం

ఈడెన్‌ పార్క్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. సాయంత్రం మంచు ప్రభావం ఉంటుంది. టాస్‌ గెలిచిన జట్టు ఛేజింగ్‌కు మొగ్గుచూపొచ్చు. మ్యాచ్‌ రోజు వర్ష సూచన లేద
logo