శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Aug 11, 2020 , 00:47:47

కార్గిల్‌ సైనికులే స్ఫూర్తి: దీపా మాలిక్‌

కార్గిల్‌ సైనికులే స్ఫూర్తి: దీపా మాలిక్‌

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో కార్గిల్‌ యుద్ధంలో అవయవాలు కోల్పోయినా చెదరని ఆత్మవిశ్వాసం అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైనికులే తనకు స్ఫూర్తి అని పారాలింపిక్‌ స్టార్‌ అథ్లెట్‌ దీపా మాలిక్‌ తెలిపింది. సైనికులు ఇచ్చిన ప్రేరణతోనే తాను విజయాలు సాధించానని చెప్పుకొచ్చింది. 1999లో స్పైనల్‌ ట్యూమర్‌ సర్జరీ కోసం ఆర్మీ ఆసుపత్రిలో చేరిన మాలిక్‌.. కార్గిల్‌ సైనికులను ఆదర్శంగా తీసుకుంది. ఆ తర్వాత కుర్చీకే పరిమితమైనా ఎన్నో విజయాలు సాధించింది. పారాలింపిక్స్‌(రియో 2016)లో పతకం సాధించిన తొలి భారతీయురాలిగా   చరిత్ర సృష్టించింది. ప్యాడ్లర్‌ ముదిత్‌ దానీ సోమవారం నిర్వహించిన ఓ చాట్‌ షోలో దీపా గత స్మృతులను గుర్తుకు తెచ్చుకుంది. ‘ఆరోగ్యంగా ఉన్న యువకులు.. విధినిర్వహణలో అవయవాలు కోల్పోయారు, నాకు వ్యాధి ఉంది కాబట్టి అవయావాలను కోల్పోతున్నా.. ఈ విషయంలో బాధపడాల్సిన అవసరమే లేదని నేను అనుకున్నా. సైనికులనే స్ఫూర్తిగా తీసుకున్నా’  అని దీపా చెప్పింది. అలాగే వచ్చే ఏడాది టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల పతకాల సంఖ్య రెండంకెలు దాటుతుందని దీపామాలిక్‌  విశ్వాసం వ్యక్తం చేసింది. 


logo