శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 02, 2020 , 14:13:40

20 ఓవర్లలో భారత్‌ స్కోరు 163/3

20 ఓవర్లలో భారత్‌ స్కోరు 163/3

మౌంట్‌ మాంగనుయ్‌: న్యూజిలాండ్‌తో మౌంట్‌ మాంగనుయ్‌లోని బే ఓవల్‌ మైదానంలో జరుగుతున్న 5వ టీ20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (41 బంతుల్లో 60 పరుగులు, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించగా, వికెట్‌ కీపర్‌ లోకేష్‌ రాహుల్‌ (33 బంతుల్లో 45 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. కివీస్‌ బౌలర్లలో స్కాట్‌ కుగెలెయిన్‌కు 2 వికెట్లు దక్కగా, హమీష్‌ బెన్నెట్‌ 1 వికెట్‌ పడగొట్టాడు. 


logo