ఆదివారం 29 మార్చి 2020
Sports - Feb 08, 2020 , 11:28:17

NZvIND:ఓపెనర్లు ఔట్‌.. కష్టాల్లో భారత్‌

 NZvIND:ఓపెనర్లు ఔట్‌.. కష్టాల్లో భారత్‌

రెండో వన్డేలో టీమ్‌ఇండియా స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.

ఆక్లాండ్‌: ఈడెన్‌ పార్క్‌లో జరుగుతున్న రెండో వన్డేలో టీమ్‌ఇండియా స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 21 వద్ద బెనెట్‌ బౌలింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ పెవిలియన్‌ చేరగా.. 5వ ఓవర్లో జేమిసన్‌ వేసిన ఆఖరి బంతికి యువ క్రికెటర్‌ పృథ్వీషా బౌల్డ్‌ అయ్యాడు. 274 పరుగుల లక్ష్య ఛేదనలో తక్కువ స్కోరుకే ఓపెనర్లు ఔట్‌కావడంతో భారత్‌పై ఒత్తిడి నెలకొంది. క్లిష్టపరిస్థితిలో నాలుగో నంబర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఎలా ఆడుతాడన్నది ఆసక్తికరంగా మారింది. కివీస్‌ బౌలర్లు తొలి ఓవర్‌ నుంచే కళ్లుచెదిరే బంతులతో భారత్‌ను బెంబేలెత్తిస్తున్నారు.

తొలి వన్డేలో ఫర్వాలేదనిపించిన కొత్త ఓపెనర్లు రెండో వన్డేలో పూర్తిగా తేలిపోయారు. అరంగేట్ర మ్యాచ్‌ తొలి ఓవర్‌లోనే  జేమిసన్‌ వికెట్‌ తీసి ఆకట్టుకున్నాడు. 7 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. కోహ్లీ(6), శ్రేయస్‌(8) క్రీజులో ఉన్నారు.  మార్టిన్‌ గప్తిల్‌(79: 79 బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సర్లు), రాస్‌ టేలర్‌(73 నాటౌట్‌: 74 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించడంతో కివీస్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 273 పరుగులు చేసింది. logo