శుక్రవారం 22 జనవరి 2021
Sports - Dec 04, 2020 , 14:20:57

రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా

రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా

క్యాన్‌బెరా: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టీ20లో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ (1), కెప్టెన్ విరాట్ కోహ్లి (9) ఔట‌య్యారు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ధావ‌న్ క్లీన్ బౌల్డ్ కాగా.. స్వెప్స‌న్ బౌలింగ్‌లో కోహ్లి అత‌నికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం కోహ్లి సేన 9 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 68 పరుగులు చేసింది. రాహుల్‌, శాంస‌న్ క్రీజులో ఉన్నారు.


logo