సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Feb 10, 2020 , 02:41:01

భారత్‌ పరాజయం

భారత్‌ పరాజయం
  • 2-3తో బెల్జియం చేతిలో ఓడిన మన్‌ప్రీత్‌ సేన

భువనేశ్వర్‌: గత మ్యాచ్‌లో విశ్వవిజేత బెల్జియంకు షాకిచ్చిన భారత పురుషుల హాకీ జట్టుకు మలిపోరులో నిరాశ ఎదురైంది. ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రొ లీగ్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 2-3తో బెల్జియం చేతిలో పరాజయం పాలైంది. భారత్‌ తరఫున వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ (15వ ని.లో), అమిత్‌ రొహిదాస్‌ (17వ ని.లో) చెరో గోల్‌ చేయగా.. బెల్జియం తరఫున మ్యాక్సిమ్‌ ప్లెనేవాక్స్‌ (17, 26వ నిమిషాల్లో) డబుల్‌ గోల్స్‌తో చెలరేగగా.. అలెగ్జాండర్‌ హెండ్రిక్స్‌ (3వ ని.లో)ఓ గోల్‌ కొట్టాడు. 


గత మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన మన్‌ప్రీత్‌ సేన.. రెండో రోజు అదే జోరు కొనసాగించలేకపోయింది.  ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ రెండో సీజన్‌లో తొలి రౌండ్లో నెదర్లాండ్స్‌ను రెండు సార్లు చిత్తు చేసిన మన్‌ప్రీత్‌ సేన.. బెల్జియంపై ఓ మ్యాచ్‌ నెగ్గి మరో మ్యాచ్‌ ఓడటంతో 8 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. బెల్జియం (14 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నది. 


logo