శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 11, 2020 , 07:11:29

NZvIND:ఆఖరి వన్డే..భారత్‌ ఫస్ట్‌ బ్యాటింగ్‌

NZvIND:ఆఖరి వన్డే..భారత్‌ ఫస్ట్‌ బ్యాటింగ్‌

గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన భారత ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ స్థానంలో మనీశ్‌ పాండేను తుది జట్టులోకి తీసుకున్నట్లు టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ చెప్పాడు.

మౌంట్‌ మాంగనీ:  న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమ్‌ఇండియా పరువు కాపాడుకునేందుకు బరిలో దిగింది. ఇప్పటికే 0-2తో సిరీస్‌ కోల్పోయిన భారత్‌ ఆఖరి వన్డేలో గట్టి పోటీనివ్వాలనుకుంటోంది.  కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఫిట్‌నెస్‌ సాధించి ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. టాస్‌ గెలిచిన విలియమ్సన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. చాప్‌మన్‌ స్థానంలో సాంట్నర్‌ జట్టులోకి వచ్చాడు. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన భారత ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ స్థానంలో మనీశ్‌ పాండేను తుది జట్టులోకి తీసుకున్నట్లు టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ చెప్పాడు.  

1989లో వెస్టిండీస్‌ చేతిలో వైట్‌వాష్‌కు గురైన తర్వాత.. మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌ల్లో భారత్‌ అన్ని మ్యాచ్‌లు ఓడలేదు. మరి ఈ రికార్డును నిలుపుకుంటూ.. టెస్టు సిరీస్‌కు ముందు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలంటే చివరి వన్డేలో విరాట్‌ సేన విజృంభించాల్సి ఉంటుంది.
logo