బుధవారం 20 జనవరి 2021
Sports - Jan 09, 2021 , 15:27:05

సిరాజ్‌, బుమ్రాల‌ను వేధించిన సిడ్నీ ప్రేక్ష‌కులు..

సిరాజ్‌, బుమ్రాల‌ను వేధించిన సిడ్నీ ప్రేక్ష‌కులు..

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడ‌వ టెస్టులో భార‌త బౌల‌ర్లు మొహ‌మ్మ‌ద్ సిరాజ్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రాలు జాత్యాంహ‌కార వేధింపుల‌కు గుర‌య్యారు. సిడ్నీ క్రికెట్ మైదానంలో ఉన్న ప్రేక్ష‌కులు ఈ వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. మూడ‌వ రోజు ఆట ముగిసిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.  సీనియ‌ర్ ప్లేయ‌ర్లు కెప్టెన్ అజింక్య ర‌హానే, ర‌విచంద్ర అశ్విన్‌లు.. ఈ అంశాన్ని మ్యాచ్ అంపైర్ల‌కు ఫిర్యాదు చేశారు.  పౌల్ రైఫిల్‌,  పౌల్ విల్స‌న్ అంపైర్లతో ఈ అంశంపై ర‌హానే చాలా సేపు చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది.

ఆట ముగిసిన 5 నిమిషాల త‌ర్వాత కూడా ఈ అంశం గురించి అంపైర్ల‌తో చ‌ర్చ జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు. అయితే దీనిపై ఐసీసీ నిర్ణ‌యం తీసుకోనున్న‌ది. సెక్యూర్టీ అధికారులతోనూ ర‌హానే మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది.  జాత్యాంహ‌కార వ్యాఖ్య‌ల ప‌ట్ల భార‌తీయ అధికారులు ఆగ్ర‌హం ఉన్న‌ట్లు ప‌లు మీడియా సంస్థ‌లు పేర్కొన్నాయి.  మూడ‌వ రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 103 ర‌న్స్ చేసింది. ఇండియా త‌న తొలి ఇన్నింగ్స్‌లో 244 ర‌న్స్‌కు ఆలౌట్ అయ్యింది. 


logo