శుక్రవారం 10 జూలై 2020
Sports - May 08, 2020 , 10:05:30

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ మాఫియా భారత్‌లోనే

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ మాఫియా భారత్‌లోనే

లాహోర్‌: పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ అఖిబ్‌ జావెద్‌..భారత్‌పై తన అక్కసును వెల్లగక్కాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ మాఫియా లింక్‌లన్నీ భారత్‌లోనే ఉ న్నాయంటూ వ్యాఖ్యలు చేశాడు. గురువారం స్థానిక మీడియాతో మా ట్లాడుతూ గతంలోనూ ఐపీఎల్‌లో ఫిక్సిం గ్‌ జరిగినా.. ఎవరూ బహిర్గతం చేయడానికి సాహసం చేయలేకపోయారని అన్నాడు. ‘ఒక్కసారి ఫిక్సింగ్‌ ఊబిలో కూరుకుపోతే..  బయటికి వచ్చే అవకాశముండదు. మాఫియాను ఎదిరించే ధైర్యం చేయలేకపోతారు. ఫిక్సింగ్‌ కారణంగా నా కెరీర్‌ అర్ధాంతరంగా ముగిసింది’ అని జావెద్‌ అన్నాడు. 


logo