మంగళవారం 19 జనవరి 2021
Sports - Nov 24, 2020 , 18:48:15

వ్యక్తిగత లక్ష్యాలేం లేవు: గిల్‌

 వ్యక్తిగత లక్ష్యాలేం లేవు: గిల్‌

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో వ్యక్తిగత లక్ష్యాలు నిర్దేశించుకోలేదని.. జట్టు విజయాల్లో తనవంతు బాధ్యత నిర్వర్తించాలనుకుంటున్నట్లు భారత యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ చెప్పాడు. టీమ్‌ఇండియా తరఫున ఇప్పటి వరకు రెండు వన్డేలు ఆడిన గిల్‌  మాట్లాడుతూ.. ‘నాకు ఇదే తొలి ఆస్ట్రేలియా పర్యటన. భారత్‌,ఆసీస్‌ మధ్య మ్యాచ్‌లు చూసి ఎంతో ఉద్వేగానికి గురయ్యేవాడిని. ఈ టూర్‌లో ఎలాంటి వ్యక్తిగత లక్ష్యాలు పెట్టుకోలేదు’ అని అన్నాడు. 

మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే.. రోహిత్‌ శర్మలాగా దీర్ఘకాలం జట్టుకు ఉపయోగపడతాడని భారత మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇయాన్‌ మోర్గాన్‌ను వదులుకోవడమే కోల్‌కతాకు మంచిదని చోప్రా పేర్కొన్నాడు. వేలంలో గిల్‌, వరుణ్‌ చక్రవర్తి, రస్సెల్‌ను రిటైన్‌ చేసుకొని కొత్త జట్టును తీర్చిదిద్దడం ఉత్తమమని ఉచిత సలహా ఇచ్చాడు.