సోమవారం 25 జనవరి 2021
Sports - Dec 31, 2020 , 18:45:45

భారత హాకీ దిగ్గజం మైఖేల్‌ ఖిండో కన్నుమూత

భారత హాకీ దిగ్గజం మైఖేల్‌ ఖిండో కన్నుమూత

ఢిల్లీ: భారత హాకీ దిగ్గజం మైఖేల్‌ ఖిండో(73) గురువారం కన్నుమూశారు.   1975 హాకీ ప్రపంచ కప్, 1972 ఒలింపిక్స్ కాంస్య పతక విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడైన మైఖేల్ వయసు సంబంధిత వ్యాధుల కారణంగా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.  అతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. 

'వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో  ఖిండో ఇస్పాట్ జనరల్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా తీవ్ర  ఒత్తిడితో   బాధపడుతున్నాడని' కుటుంబసభ్యులు తెలిపారు. మైఖేల్‌ మృతిపట్ల హాకీ ఇండియా, ఒడిశా స్పోర్ట్స్‌, మాజీ ఆటగాళ్లు  సంతాపం ప్రకటించారు. 


logo