మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 10, 2020 , 15:41:18

ధోనీతో నేను మాట్లాడా..!

ధోనీతో నేను మాట్లాడా..!

ఐపీఎల్‌లో ఆటను బట్టి పునరాగమనంపై ధోనీ నిర్ణ యం ఉంటుంది. జట్టుకు భారంగా ఉండాలని మాత్రం మహీ అనుకోడు’ అని రవిశాస్త్రి చెప్పా డు.

  • కోచ్‌ రవిశాస్త్స్త్రి వ్యాఖ్య

న్యూఢిల్లీ: గతేడాది ప్రపంచకప్‌ టోర్నీ తర్వాతి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న టీమ్‌ఇండియా మాజీ సారథి ధోనీ త్వరలోనే వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతాడని హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి వెల్లడించాడు. ఐపీఎల్‌ ఫామ్‌ ధోని కెరీర్‌కు కీలకమని అభిప్రాయపడ్డాడు. ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న శాస్త్రి.. ధోనీ అంశంతో పాటు పలు విషయాలపై మాట్లాడాడు. టెస్టులను నాలుగు రోజులే నిర్వహించాలన్న ఐసీసీ ఆలోచన అర్థరహితమని అన్నాడు. ‘ధోనీతో నేను మాట్లాడా. ఇప్పటికే అతడు టెస్టుల నుంచి తప్పుకున్నాడు, త్వరలోనే వన్డేల నుంచి రిటైరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెరీర్‌లో ఒకానొక సమయంలో ధో నీ అన్ని ఫార్మాట్లు విశ్రాంతి లేకుండా ఆడాడు. ఈ వయసులో మహీ ఒక్క ఫార్మాటే ఆడేందుకు ఇష్టపడొచ్చు. మళ్లీ అతడు బరిలోకి దిగాలనుకుంటే టీ20లను ఎంచుకుంటాడు. ఐపీఎల్‌లో ఆటను బట్టి పునరాగమనంపై ధోనీ నిర్ణ యం ఉంటుంది. జట్టుకు భారంగా ఉండాలని మాత్రం మహీ అనుకోడు’ అని రవిశాస్త్రి చెప్పా డు. టెస్టులను నాలుగు రోజులకు కుదించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.

Image result for India head coach Ravi Shastri reveals MS Dhoni could end ODI career to play T20Is


logo
>>>>>>