ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Feb 15, 2021 , 00:36:26

ప్రవీణ్‌, నిషాద్‌కు స్వర్ణాలు

ప్రవీణ్‌, నిషాద్‌కు స్వర్ణాలు

 దుబాయ్‌: అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ప్రి చివరి రోజు పోటీల్లో భారత్‌కు మరో రెండు స్వర్ణాలు దక్కాయి. ఆదివారం ఇక్కడ జరిగిన హై జంప్‌లో భారత పారా అథ్లెట్లు ప్రవీణ్‌ కుమార్‌, నిషాద్‌ కుమార్‌ ఆసియా రికార్డులు తిరుగరాసి పసిడి పతకాలను కైవసం చేసుకున్నారు. ఈ టోర్నీలో భారత్‌ ఓవరాల్‌గా 23 పతకాలు చేజిక్కించుకుంది. 34 పతకాలతో థాయ్‌లాండ్‌ టాప్‌లో ఉండగా.. భారత్‌, టర్కీ, కెన్యా 23 మెడల్స్‌తో ఆ తర్వాతి ప్లేస్‌లో నిలిచాయి 


VIDEOS

logo