ఆదివారం 29 మార్చి 2020
Sports - Feb 03, 2020 , 17:20:39

టీమ్‌ఇండియాకు మళ్లీ జరిమానా

టీమ్‌ఇండియాకు మళ్లీ జరిమానా

భారత్‌, కివీస్‌ మధ్య బుధవారం నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది.

మౌంట్‌మాంగనీ: న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో  మందకొడిగా బౌలింగ్‌ చేసినందుకు టీమ్‌ఇండియా ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 40శాతం(రెండు ఓవర్లు) కోత పడిన విషయం తెలిసిందే.  తాజాగా ఆదివారం జరిగిన ఐదో టీ20లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా మళ్లీ 20శాతం జరిమానాకు గురైంది. నిర్ణీత సమయంలో భారత్‌ ఒక ఓవర్‌ తక్కువగా వేయడంతో మ్యాచ్‌ రెఫరీ క్రిస్‌ బ్రాడ్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐదో టీ20లో టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించిన రోహిత్‌ శర్మ.. రెఫరీ విధించిన ఫైన్‌ను అంగీకరించాడు. 

అర్ధశతకం పూర్తి చేసుకున్నాక కండరాలు పట్టేయడంతో రోహిత్‌ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.   కివీస్‌ లక్ష్య ఛేదనలో  రోహిత్‌ మైదానంలో ఫీల్డింగ్‌కు రాకపోవడంతో కేఎల్‌ రాహుల్‌  కెప్టెన్‌గా వ్యవహరించాడు. న్యూజిలాండ్‌ గడ్డపై టీమ్‌ఇండియా టీ20  సిరీస్‌ దక్కించుకోవడం  ఇదే తొలిసారి. భారత్‌, కివీస్‌  మధ్య బుధవారం నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది.logo