సోమవారం 01 మార్చి 2021
Sports - Jan 24, 2021 , 19:05:36

ఈనెల 27న బయో బబుల్‌లోకి భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు

ఈనెల 27న బయో బబుల్‌లోకి  భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు

ముంబై: రెండు నెలల సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టు త్వరలో భారత్‌కు రానుంది. టెస్టు సిరీస్‌లో మొదటి రెండు టెస్టులకు చెన్నై ఆతిథ్యమివ్వనుంది.   ఈ నేపథ్యంలో జనవరి 27న చెన్నైలో భారత్‌, ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు బయో బబుల్‌లోకి ప్రవేశించనున్నారు.  నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఫిబ్రవరి 5 నుంచి ఆరంభంకానుంది. 

భారత ఆటగాళ్లు వివిధ నగరాల నుంచి ముందుగా చెన్నై చేరుకుంటారు.  వీరంతా జనవరి 27న  బయో సెక్యూర్‌ బబుల్‌లోకి ప్రవేశిస్తారు.  భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది  వారం రోజుల క్వారంటైన్‌లో ఉంటారు.   ఇంగ్లీష్‌ టీమ్‌ కూడా అదే రోజు బబుల్‌లోకి వెళ్లనుంది.     

జనవరి 26న శ్రీలంకతో టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత  అక్కడి నుంచి నేరుగా చెన్నైకి వస్తారు.  మ్యాచ్‌ అధికారులతో పాటు ఇరు జట్ల ఆటగాళ్లు కూడా నగరంలోని లీలా ప్యాలెస్‌లో బస చేయనున్నారు.  మొదటి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. 

VIDEOS

logo