శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 08, 2020 , 14:54:57

ఆసీస్‌ బౌలర్ల హవా..భారత్‌ 30/4

ఆసీస్‌ బౌలర్ల హవా..భారత్‌ 30/4

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 185  పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత అమ్మాయిల జట్టు స్వల్ప స్కోరుకే ప్రధాన వికెట్లు చేజార్చుకుంది. మెగాన్‌ షట్‌ తొలి ఓవర్‌ మూడో బంతికే యువ సంచలనం షఫాలీ వర్మను ఔట్‌ చేసి భారత్‌ పతనాన్ని ఆరంభించింది. ఆ తర్వాత వరుస విరామాల్లో భారత అమ్మాయిలు పెవిలియన్‌ బాటపట్టారు. జట్టు స్కోరు 8 వద్ద జెమీమా రోడ్రిగ్స్‌ వెనుదిరగ్గా.. స్టార్‌ బ్యాట్స్‌వుమన్‌ స్మృతి మంధాన ఔటైంది. 

ఈ దశలో ఆచితూచి ఆడాల్సిన కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ నాలుగో వికెట్‌ రూపంలో ఔటవడంతో కప్పుపై భారత్‌ ఆశలు వదులుకుంది.  టోర్నీలో ఎక్కువగా షఫాలీపైనే ఆధారపడిన భారత అమ్మాయిలు..పటిష్ఠ ఆసీస్‌ బౌలింగ్‌  దెబ్బకు టాప్‌ ఆర్డర్‌ పేకమేడలా కుప్పకూలింది. 8 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లకు 39పరుగులు చేసింది. దీప్తి శర్మ(10), కృష్ణమూర్తి(5) క్రీజులో ఉన్నారు. logo