శనివారం 06 మార్చి 2021
Sports - Feb 06, 2021 , 10:28:08

రెండేళ్లు నాన్‌స్టాప్ క్రికెట్‌.. షెడ్యూల్ ప్ర‌క‌టించిన బీసీసీఐ

రెండేళ్లు నాన్‌స్టాప్ క్రికెట్‌.. షెడ్యూల్ ప్ర‌క‌టించిన బీసీసీఐ

ముంబై:  రెండేళ్లు నాన్‌స్టాప్ క్రికెట్ అల‌రించ‌నున్న‌ది.  2021-2023 వ‌ర‌కు సంబంధించిన టీమిండియా షెడ్యూల్‌ను బీసీసీఐ రిలీజ్ చేసింది.  2022లో ఆస్ట్రేలియాలో జ‌ర‌గ‌నున్న వ‌రల్డ్‌క‌ప్ వ‌ర‌కు.. దాదాపు 15 నెల‌ల పాటు బ్రేక్ లేకుండా కోహ్లీ టీమ్ క్రికెట్ ఆడ‌నున్న‌ది.  అయితే గత ఏడాది కోవిడ్ వ‌ల్ల చాలా వ‌ర‌కు క్రికెట్ టోర్నీలు రద్దు అయిన విష‌యం తెలిసిందే.  దీంతో 2021 నుంచి 2023 వ‌ర‌కు మూడు వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలు జ‌ర‌గ‌నున్నాయి.  

ఇదీ షెడ్యూల్‌..  

ఏప్రిల్ నుంచి మే 2021 వ‌ర‌కు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌..

జూన్ నుంచి జూలై 2021 వ‌ర‌కు వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌, ఇండియా వ‌ర్సెస్ శ్రీలంక‌(3వ‌న్డేలు, 5టీ20లు),ఆసియా క‌ప్ 

జూలై 2021లో ఇండియా వ‌ర్సెస్ జింబాబ్వే(3వ‌న్డేలు)

జూలై నుంచి సెప్టెంబ‌ర్ 2021 వ‌ర‌కు ఇండియా వ‌ర్సెస్ ఇంగ్లండ్ (5 టెస్టులు) 

అక్టోబ‌ర్ 2021లో ఇండియా వ‌ర్సెస్ సౌతాఫ్రికా(3 వ‌న్డేలు, 5టీ20లు)

2021 అక్టోబ‌ర్ నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌

న‌వంబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ 21 వ‌ర‌కు ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్‌(2టెస్టులు, 3టీ2ఏలు), ఇండియా వ‌ర్సెస్  సౌతాఫ్రికా(3టెస్టులు, 3టీ20లు),  

2022 షెడ్యూల్‌..

2022లో జ‌న‌వ‌రి నుంచి మార్చి వ‌ర‌కు  ఇండియా వ‌ర్సెస్ వెస్టిండీస్‌(3వ‌న్డేలు, 3టీ20లు), ఇండియా వ‌ర్సెస్ శ్రీలంక‌(3టెస్టులు, 3 టీ20లు), 

ఏప్రిల్ నుంచి మే వ‌ర‌కు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌

జూలై నుంచి ఆగ‌స్టు వ‌ర‌కు ఇండియా వ‌ర్సెస్ ఇంగ్లండ్‌(3వ‌న్డేలు, 3 టీ20లు), ఇండియా వ‌ర్సెస్ వెస్టిండీస్‌(3వ‌న్డేలు,3టీ20లు) 

సెప్టెంబ‌ర్‌లో ఆసియా క‌ప్ 

అక్టోబ‌ర్ నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు ఆస్ట్రేలియాలో ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌

న‌వంబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు ఇండియా వ‌ర్సెస్ బంగ్లాదేశ్‌(2 టెస్టులు, 3టీ20లు), ఇండియా వ‌ర్సెస్ శ్రీలంక‌(5వ‌న్డేలు) 

2023 షెడ్యూల్ 

జ‌న‌వ‌రిలో ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్‌(3వ‌న్డేలు, 3టీ20లు) 

ఫిబ్ర‌వ‌రి నుంచి మార్చి వ‌ర‌కు  ఇండియా వ‌ర్సెస్ ఆస్ట్రేలియా(4టెస్టులు, 3వ‌న్డేలు, 3టీ20లు) 

VIDEOS

logo