బుధవారం 08 జూలై 2020
Sports - Jun 24, 2020 , 01:07:45

ఆగస్టులో క్రీడా టోర్నీల పునరుద్ధరణ: రిజిజు

ఆగస్టులో క్రీడా టోర్నీల పునరుద్ధరణ: రిజిజు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో పరిస్థితులకు అనుగుణంగా  టోర్నీలు నిర్వహించేందుకు క్రీడాశాఖ సిద్ధమవుతున్నది. వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకుల్లేకుండా ఆగస్టు నుంచి టోర్నీలు మొదలయ్యే అవకాశముందని మంగళవారం కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్‌ దినోత్సవం సందర్భంగా భారత ఒలింపిక్‌ సంఘం(ఐవోఏ)తో పాటు 15 జాతీయ సమాఖ్యలకు చెందిన ప్రతినిధులతో మంత్రి ఆన్‌లైన్‌లో మాట్లాడారు. ‘క్రీడల పునరుద్ధరణపై ఆయా జాతీయ సమాఖ్యల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు కోరాం. ఆగస్టు నుంచి టోర్నీలు మొదలవుతాయన్న నమ్మకముంది. ఇప్పుడిప్పుడే దేశంలో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. టోర్నీలు మొదలుపెట్టడానికి సరైన సమయంగా భావిస్తున్నాం.  ప్రేక్షకుల్లేకుండా చిన్న టోర్నీలు మొదలుపెట్టి టెలివిజన్‌, సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రసారాలు చేస్తాం. దీని ద్వారా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగడంతో పాటు క్లిష్ట సమయంలో సానుకూల దృక్పథం ఏర్పడుతుంది’ అని రిజిజు అన్నారు.  


logo