బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Jan 20, 2020 , 02:48:13

యువ భారత్‌ బోణీ

యువ భారత్‌ బోణీ
  • శ్రీలంకపై 90 పరుగులతో గెలుపు.. అండర్‌-19 ప్రపంచకప్‌

బ్లూమ్‌ఫాంటైన్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌హోదాలో ప్రపంచకప్‌ బరిలో దిగిన భారత అండర్‌-19 జట్టు.. తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో సమిష్టిగా సత్తాచాటిన కుర్రాళ్లు 90 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించారు. మొదట బ్యాటింగ్‌ చేసిన యువ భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 297 పరుగులు చేసింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (59), కెప్టెన్‌ ప్రియం గార్గ్‌ (56), వికెట్‌ కీపర్‌ ధృవ్‌ జురేల్‌ (52) అర్ధశతకాలతో మెరిస్తే.. తెలంగాణ ఆటగాడు ఠాకూర్‌ తిలక్‌ వర్మ (46), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' సిద్ధేశ్‌ వీర్‌ (44) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో లంక 45.2 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో ఆకాశ్‌ సింగ్‌, సిద్ధేశ్‌ వీర్‌, రవి బిష్ణోయ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

కలిసికట్టుగా..

అంచనాల ఒత్తిడిలో బరిలో దిగిన ముంబై ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌.. అందుకు తగ్గట్లే ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్‌ దివ్యాన్ష్‌ సక్సేనా (23)తో కలిసి జట్టుకు శుభారంభాన్నిచ్చారు. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్‌ వర్మ కూడా చక్కటి షాట్లతో అలరించడంతో ఇన్నింగ్స్‌ సజావుగా సాగింది. వరుస విరామా ల్లో వికెట్లు పడుతున్నా.. క్రీజులో అడుగుపెట్టిన ప్రతి ఆటగాడు మంచి ప్రదర్శన కనబర్చడంతో భారత్‌.. భారీ స్కోరు చేయగలిగింది.

స్కోరు బోర్డు

భారత్‌: యశస్వి (సి) కమిల్‌ (బి) మధుషనక 59, దివ్యాన్ష్‌ (సి) పెరెరా (బి) అమ్షి 23, తిలక్‌ వర్మ (స్టంప్డ్‌) కమిల్‌ (బి) డానియల్‌ 46, ప్రియం గార్గ్‌ (స్టంప్డ్‌) కమిల్‌ (బి) నదీషన్‌ 56, ధృవ్‌ (నాటౌట్‌) 52, సిద్ధేశ్‌ (నాటౌట్‌) 44, ఎక్స్‌ట్రాలు: 17, మొత్తం: 50 ఓవర్లలో 297/4. వికెట్ల పతనం: 1-66, 2-112, 3-171, 4-234, బౌలింగ్‌: అమ్షి 6-0-40-1, పథిరన 8-0-49-0, డానియల్‌ 10-1-39-1, మధుషనక 10-0-69-1, నదీషన్‌ 10-0-58-1, పరణవితన 6-0-41-0.

శ్రీలంక: పరణవితన (సి) ఆకాశ్‌ (బి) సుశాంత్‌ 6, కమిల్‌ (బి) సిద్ధేశ్‌ 39, రసంత (బి) యశస్వి 49, కడువరాచి (సి) తిలక్‌ (బి) కార్తీక్‌ 15, ఎన్డీ పెరెరా (ఎల్బీ) ఆకాశ్‌ 50, దినుష (సి) ధృవ్‌ (బి) ఆకాశ్‌ 16, నదీషన్‌ (బి) రవి బిష్ణోయ్‌ 4, డానియల్‌ (ఎల్బీ) రవి బిష్ణోయ్‌ 0, అమ్షి (సి) ప్రియం (బి) సిద్ధేశ్‌ 5, మధుషనక (రనౌట్‌/సక్సేనా) 4, పతిరణ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 19, మొత్తం: 45.2 ఓవర్లలో 207 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-19, 2-106, 3-113, 4-148, 5-181, 6-195, 7-195, 8-203, 9-203, 10-207, బౌలింగ్‌: కార్తీక్‌ 7.2-0-27-1, సుశాంత్‌ 7-0-34-1, ఆకాశ్‌ 9-1-29-2, సిద్ధేశ్‌ 6-0-34-2, రవి 10-0-44-2, శుభాంగ్‌ 2-0-10-0, యశస్వి 3-0-18-1, తిలక్‌ 1-0-6-0.


logo