WTC Final 2023 : టెస్టు క్రికెట్లో కొత్త చాంపియన్ ఎవరో తేల్చే పోటీకి మరికొన్ని గంటలే ఉంది. ఓవల్(Oval) స్టేడియం ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్‌పైనే అందరి కళ్లు నిలిచాయి. భారత్, ఆస్ట్రేలియా జట్లలో టెస్టు గదను సగర్వంగా అందుకునేది ఎవరు? అనేది తర్వలో తేలనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఫైనల్ ఫైట్ ప్రారంభం కానుంది. ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో తెలుసా..?
భారత్, ఆస్ట్రేలియా తొలిసారి.. ప్రపంచ మేటి జట్లు అయిన భారత్, ఆస్ట్రేలియా తటస్థ వేదికపై ఆడుతున్న తొలి టెస్టు ఇది.
జూన్‌లో ఇదే ఫస్ట్ .. ఓవల్ స్టేడియం చరిత్రలోనే మొదటిసారిగా జూన్ నెలలో టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు.
డ్యూక్స్ బంతితో.. ఫైనల్ పోరులో డ్యూక్స్ బంతిని ఉపయోగిస్తున్నారు. దీన్ని ఇంగ్లండ్‌లోని డ్యూక్స్ క్రికెట్ కంపెనీ తయారుచేస్తుంది. ఇది ఎర్ర బంతిలా తొందరగా పాడవ్వదు. డ్యూక్స్ బాల్ రెండు వైపులా వెనక నుంచి ముందుకు ఆరు కుట్లు కనిపిస్తాయి. దాంతో, ఆ బంతి ఎక్కువ సేపు తన ఆకారాన్ని కోల్పోదు. దృఢంగా కూడా ఉంటుంది. అంతేకాదు దీంతో బౌలర్లు స్వింగ్ ఎక్కువ రాబడతారు.
భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చటేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, శార్థూల్ ఠాకూర్, షమీ, ఉమేశ్ యాదవ్, సిరాజ్, జయదేవ్ ఉనాద్కాట్.
ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్, జోష్ ఇంగ్లిస్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నసిర్, మార్కస్ హ్యారిస్.