సోమవారం 01 మార్చి 2021
Sports - Feb 14, 2021 , 10:15:56

పంత్ అర్ధ సెంచ‌రీ.. భార‌త్ 329 ఆలౌట్

పంత్ అర్ధ సెంచ‌రీ.. భార‌త్ 329 ఆలౌట్

చెన్నై చెపాక్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో భార‌త్ 329 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఓవ‌ర్ నైట్ స్కోరు 300 ప‌రుగుల‌తో ఇన్నింగ్స్ కొన‌సాగించిన కొద్ది సేప‌టికే అక్ష‌ర్ ప‌టేల్ (5) వికెట్‌ను కోల్పోయింది. అనంత‌రం రెండు బాల్స్ ఆడిన ఇషాంత్ శ‌ర్మ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఓ వైపు వికెట్లు ప‌డుతున్న నేప‌థ్యంలో పంత్( 58 నాటౌట్‌) త‌న జూలు విదిల్చి సిక‌ర్ల మోత మోగించాడు. ఈ క్ర‌మంలో అర్ధ సెంచ‌రీ పూర్తి చేశాడు. అయితే టెయిలండ‌ర్ బ్యాట్స్‌మెన్స్ కుల్‌దీప్ యాదవ్‌(0), సిరాజ్‌( 4) లు వెంట‌వెంట‌నే ఔట్ కావ‌డంతో భార‌త్ 329 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ముందు రోజు రోహిత్ శ‌ర్మ (161), అజింక్యా ర‌హానే(67) అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడ‌డంతో భార‌త్ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు చేయ‌గ‌లిగింది. స్పిన్‌కు స్వర్గధామంలా కనిపిస్తున్న చెపాక్‌ పిచ్‌పై  మ‌న స్పిన్న‌ర్స్ ఏ మాత్రం రాణిస్తారో చూడాలి.

VIDEOS

logo