శనివారం 29 ఫిబ్రవరి 2020
ఓపెన‌ర్లు విఫ‌లం.. స‌న్నాహ‌క పోరులో భార‌త్ 263 ఆలౌట్‌

ఓపెన‌ర్లు విఫ‌లం.. స‌న్నాహ‌క పోరులో భార‌త్ 263 ఆలౌట్‌

Feb 14, 2020 , 11:38:35
PRINT
ఓపెన‌ర్లు విఫ‌లం.. స‌న్నాహ‌క పోరులో భార‌త్ 263 ఆలౌట్‌

వ‌న్డే సిరీస్‌లో వైట్ వాష్‌కి గురైన భార‌త్ ఇప్పుడు న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కి సిద్ధ‌మైంది. ఫిబ్ర‌వ‌రి 21 నుండి తొలి టెస్ట్ ప్రారంభం కానుండ‌గా, నేటి నుండి మూడు రోజుల పాటు న్యూజిలాండ్‌ ఎలెవెన్‌తో  సన్నాహక మ్యాచ్ ఆడుతుంది భార‌త్. తెల్ల‌వారుజామున ప్రారంభ‌మైన  మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ 263 పరుగులకి ఆలౌట్ అయింది. హ‌నుమ విహారి( 101), పుజారా( 92), ర‌హానే (18) త‌ప్ప మిగ‌తా బ్యాట్స్‌మెన్స్ అంద‌రు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవీలియ‌న్ చేరారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ పృధ్వీ షా,  శుభ్‌మన్ గిల్‌కి  కీల‌కం కాగా వారిద్ద‌రు నిరాశ‌ప‌ర‌చారు. పృథ్వీ షా( 0), మయాంక్ అగ‌ర్వాల్ (1), శుభ్‌మన్‌ గిల్‌(0),  పంత్ (7), సాహా(0), అశ్విన్‌(0), ఉమేష్ యాద‌వ్‌(9), జ‌డేజా (8) ప‌రుగులు చేశారు. న్యూజిలాండ్ బౌల‌ర్స్ లో కుగ్లెజిన్‌, సోధీ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, గిబ్స‌న్ 2, నిషామ్ ఒక వికెట్ ద‌క్కించుకున్నారు. చివ‌రి ప‌ది ఓవ‌ర్ల‌లో భార‌త్ ఆరు వికెట్లు కోల్పోయి 45 ప‌రుగులు చేసింది. రీఎంట్రీ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న పంత్ ఈ మ్యాచ్‌లోను నిరాశ‌ప‌ర‌చ‌డం విశేషం.


logo