సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Feb 24, 2020 , 05:28:39

191 పరుగులకే భారత్‌ ఆలౌట్‌.. కివీస్‌కు స్వల్ప లక్ష్యం

191 పరుగులకే భారత్‌ ఆలౌట్‌.. కివీస్‌కు స్వల్ప లక్ష్యం

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో తలపడుతున్న తొలి టెస్టులో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 144/4తో నాలుగో రోజు ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌.. కివీస్‌ పేసర్ల ధాటికి కుదేలైంది. ఓవర్‌నైట్‌ స్కోరుకు కేవలం 47 పరుగులు మాత్రమే జోడించి చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రభావం చూపుతారనుకున్న రహానే(29), హనుమ విహారి(15) వెనువెంటనే పెవిలియన్‌ బాట పట్టారు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషభ్‌ పంత్‌(41 బంతుల్లో 25) కాసేపు కివీస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. పంత్‌.. సౌథీ బౌలింగ్‌లో బౌల్ట్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరుగడంతో.. భారత లోయర్‌ ఆర్డర్‌ పేకమేడలా కూలిపోయింది. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ 5 వికెట్లతో చెలరేగగా.. ట్రెంట్‌ బౌల్ట్‌ 4 వికెట్లతో మెరిశాడు.గ్రాండ్‌హోమ్‌ 1 వికెట్‌ దక్కించుకున్నాడు. దీంతో, భారత్‌.. ఆతిథ్య కివీస్‌ ముందు 9 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఉంచింది. 


logo