సోమవారం 30 మార్చి 2020
Sports - Feb 22, 2020 , 08:36:12

ఇండియా 165 ఆలౌట్‌

ఇండియా 165 ఆలౌట్‌

హైద‌రాబాద్‌:  వెల్లింగ్ట‌న్‌లో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త్ 165 ప‌రుగుల‌కే ఆలౌటైంది.  తొలి రోజు 122 ప‌రుగుల‌కు అయిదు వికెట్లు కోల్పోయిన భార‌త్‌.. రెండ‌వ రోజు మ‌రీ పేల‌వంగా ఆడింది.  కేవ‌లం 43 ప‌రుగులు మాత్ర‌మే జోడించి మ‌రో అయిదు వికెట్ల‌ను చేజార్చుకున్న‌ది. ఇండియ‌న్ ఇన్నింగ్స్‌లో ర‌హానే అత్య‌ధికంగా 49 ర‌న్స్ చేశాడు.  చివ‌ర్లో ష‌మీ 21 ర‌న్స్ చేశాడు. కివీస్ బౌల‌ర్ల‌లో టిమ్ సౌథీ, జేమీస‌న్‌లు చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు.  ఆ త‌ర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ నిదానంగా ఆడుతున్న‌ది. ప్ర‌స్తుతం న్యూజిలాండ్ 32 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు కోల్పోయి.. 96 ర‌న్స్ చేసింది. ఇశాంత్ శ‌ర్మ ఖాతాలో రెండు వికెట్లు ప‌డ్డాయి. కివీస్ కెప్టెన్ విలియ‌మ్‌స‌న్ 37 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు.


logo