బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Jan 24, 2020 , 23:59:23

భారత్‌-‘ఎ’ ఓటమి

భారత్‌-‘ఎ’ ఓటమి

క్రైస్ట్‌చర్చ్‌: కివీస్‌ గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి విజయాల బాటలో దూసుకెళ్తున్న భారత్‌-‘ఎ’ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన అనధికారిక రెండో వన్డేలో భారత్‌-‘ఎ’ 29 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొదట న్యూజిలాండ్‌-‘ఎ’ 50 ఓవర్లలో 295 పరుగులు చేసింది. జార్జ్‌ వార్కర్‌ (135; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో చెలరేగితే.. చివర్లో మెక్‌ కొనిచ్‌ (56) ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో సిరాజ్‌కు 2, ఇషాన్‌ పొరెల్‌కు 3 వికెట్లు దక్కాయి. లక్ష్య ఛేదనలో టాపార్డర్‌ విఫలమవడంతో భారత్‌-‘ఎ’ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 266 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్‌ మయాంక్‌  (37), సూర్యకుమార్‌ (20), ఇషాన్‌ కిషన్‌ (44), శంకర్‌ (41), కృనాల్‌ (51), అక్షర్‌ పటేల్‌ (24) ఓ మోస్తరుగా రాణించారు. 


logo
>>>>>>