బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Nov 12, 2020 , 01:39:19

ఆసీస్‌ జెర్సీ అదుర్స్‌

ఆసీస్‌ జెర్సీ అదుర్స్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలి యా క్రికెట్‌ జట్టు అదిరిపోయే జెర్సీలో అభిమానులను కనువిందు చేయబోతున్నది. భారత్‌తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌లో కొత్త జెర్సీతో కంగారూలు బరిలోకి దిగనున్నారు. తమ దేశ క్రికెట్‌ వారసత్వానికి ప్రతీకగా ప్రత్యేకంగా ఈ జెర్సీని రూపొందించినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) బుధవారం పేర్కొంది. ఆస్ట్రేలియా నుంచి తొలిసారి విదేశీ పర్యటన(ఇంగ్లండ్‌లో, 1868)లో భాగమైన ఆటగాళ్ల వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ జెర్సీకి రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ఫియోనా క్లార్కె, కౌంట్నె హగెన్‌ను స్ఫూర్తిగా తీసుకొని కిట్‌ స్పాన్సర్‌ అసిక్స్‌తో కలిసి జెర్సీకి కొత్త రూపు తీసుకొచ్చినట్లు సీఏ తెలిపింది. పూర్వ, ప్రస్తుత, భవిష్యత్‌ క్రికెటర్ల ప్రాతినిధ్యాన్ని తెలిపేలా ఉన్న జెర్సీ డిజైన్‌ చూపరులను ఆకట్టుకుంటున్నది. కొత్త జెర్సీ ధరించడం ఉద్వేగంగా ఉందని ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ మిచెల్‌ స్టార్క్‌ చెప్పుకొచ్చాడు.