శుక్రవారం 22 జనవరి 2021
Sports - Dec 26, 2020 , 06:41:00

బాక్సింగ్‌ డే టెస్ట్‌: 38 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయిన ఆసిస్‌

బాక్సింగ్‌ డే టెస్ట్‌: 38 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయిన ఆసిస్‌

మెల్‌బోర్న్‌: బాక్సింగ్‌ డే టెస్టులో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆసిస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసిస్‌ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసిన బుమ్రా మెయిడెన్‌తో తన కోటాను ప్రారంభించాడు. బుమ్రా తన మూడో ఓవర్‌లో ఓపెనర్‌ జో బర్న్‌ను ఔట్‌ చేశాడు. దీంతో 10 పరుగుల వద్ద ఆసిస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన లబుషేన్‌ జాగ్రత్తగా ఆడుతున్నాడు. 

జట్టు స్కోరు 35 రన్స్‌ వద్ద ఉండగా మాథ్యూ వేడ్‌ రూపంలో రెండో వికెట్‌ను కోల్పోయింది. ఈ వికెట్‌తో భారత బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన వికెట్ల ఖాతాను తెరిచాడు. మూడు పరుగుల వ్యవధిలోనే ఆసిస్‌ తన మూడో వికెట్‌ను కోల్పోయింది. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ వేసిన అశ్విన్‌ 38 పరుగుల వద్ద స్టీవ్‌ స్మిత్‌ను అశ్విన్‌ డకౌట్‌ చేశాడు. దీంతో ప్రస్తుతం 17 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు మూడు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. ప్రస్తుతం లబుషేన్ (8)‌, ట్రావిస్‌ హేడ్‌ క్రీజ్‌ (0)లో ఉన్నారు.


logo