గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Sep 03, 2020 , 15:05:47

నవంబర్‌ 14 నుంచి లంక ప్రీమియర్‌ లీగ్‌

నవంబర్‌ 14 నుంచి లంక ప్రీమియర్‌ లీగ్‌

కొలంబో: శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌(ఎస్‌ఎల్‌పీఎల్‌) టీ20 టోర్నమెంట్‌ ఈ ఏడాది  నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 6 వరకు జరుగుతుందని శ్రీలంక క్రికెట్‌(ఎస్‌ఎల్‌సీ) బోర్డు గురువారం ప్రకటించింది.  షెడ్యూల్‌ ప్రకారం టీ20 లీగ్‌ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 20 మధ్య జరగాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. 

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌ టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌ను నవంబర్‌ మొదటి వారంలో ప్రారంభించాలనుకుంటున్నట్లు ఎస్‌ఎల్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది.  ఈ టోర్నీని రంగిరి దంబుల్లా, పల్లెకెలె, సూర్యవేవా మహింద రాజపక్సే మూడు అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాల్లో నిర్వహించనున్నారు.  15 రోజుల వ్యవధిలో  మొత్తం ఐదు జట్లు 23 మ్యాచ్‌ల్లో  తలపడనున్నాయి. 


logo