మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Nov 01, 2020 , 16:36:00

హిట్టర్లు ఔట్‌..కష్టాల్లో పంజాబ్‌

  హిట్టర్లు ఔట్‌..కష్టాల్లో పంజాబ్‌

అబుదాబి: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ స్వల్ప వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.  లుంగి ఎంగిడి పంజాబ్‌ను భారీ దెబ్బకొట్టాడు. ఓపెనర్లు రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌(26)  తన పదునైన బంతులతో బౌల్డ్‌ చేశాడు.   రాహుల్‌(29) ఔటైన తర్వాత స్కోరు వేగం తగ్గింది.

తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రమాదకర హిట్టర్‌ నికోలస్‌ పూరన్‌(2) ఎక్కువసేపు నిలువలేదు.  ఈ దశలో క్రీజులో ఉన్న క్రిస్‌గేల్‌(12) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. తాహిర్‌ వేసిన 12వ ఓవర్లో గేల్‌ ఎల్బీడబ్లూగా వెనుదిరగడంతో పంజాబ్‌ భారీస్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది. 13 ఓవర్లకు పంజాబ్‌4 వికెట్లకు 77 పరుగులు చేసింది. ప్రస్తుతం దీపక్‌ హుడా(4), మన్‌దీప్‌ సింగ్‌(4) క్రీజులో ఉన్నారు.