ఆదివారం 12 జూలై 2020
Sports - Apr 29, 2020 , 19:53:37

కరోనా కట్టడి కాకుంటే ఒలింపిక్స్ అసాధ్యం: షింజో అబే

కరోనా కట్టడి కాకుంటే ఒలింపిక్స్ అసాధ్యం: షింజో అబే

టోక్యో: కరోనా వైరస్(కొవిడ్​-19) మనుగడ కొనసాగితే వచ్చే ఏడాది కూడా టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ అసాధ్యమని జపాన్ ప్రధాని షింజో అబే చెప్పారు. టోక్యో ఒలింపిక్స్​ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యషిరో మోరీ సైతం మంగళవారం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వైద్య రంగ నిపుణులు సైతం కరోనాకు వ్యాక్సిన్ రాకుంటే విశ్వక్రీడలు నిర్వహించకూడదని సూచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒలింపిక్స్​ నిర్వహణపై ఎదురైన ప్రశ్నలకు బుధవారం షింజో అబే సమాధానమిచ్చారు. “అథ్లెట్లు, ప్రేక్షకులు సురక్షితంగా ఉండే పరిస్థితి వస్తే పూర్తిస్థాయిలో ఒలింపిక్స్​, పారాలింపిక్స్​ నిర్వహించాలన్నదే మా ఉద్దేశమని చెబుతూనే ఉన్నాం. ఒకవేళ కరోనా మహమ్మారి అప్పటిలోగా కట్టడి కాకుంటే ఒలింపిక్స్ జరుగడం అసాధ్యం” అని జపాన్ ప్రధాని అబే చెప్పారు. ఈ ఏడాది జూలైలో ప్రారంభం కావాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా వైరస్ తీవ్రత కారణంగా 2021కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జూలై 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు విశ్వక్రీడలు జరగాల్సి ఉంది. 


logo