శనివారం 04 జూలై 2020
Sports - Apr 23, 2020 , 13:17:20

‘ఒలింపిక్స్ మళ్లీ వాయిదా పడడం అసాధ్యం’

‘ఒలింపిక్స్ మళ్లీ వాయిదా పడడం అసాధ్యం’

టోక్యో: టోక్యో ఒలింపిక్స్ మరోసారి వాయిదా పడే అవకాశమే లేదని విశ్వక్రీడల నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యషిరో మోరీ స్పష్టం చేశాడు. ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ వచ్చే ఏడాది జూలైకు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఆలస్యం చేయడం అసాధ్యమని గురువారం ఓ వార్త ఏజెన్సీతో మోరీ చెప్పాడు. ఒలింపిక్స్​ను రెండేండ్ల పాటు వాయిదా వేద్దామని జపాన్ ప్రధాని అబేకు తాను గతంలోనే ప్రతిపాదించానని, అయితే ఏడాది మాత్రమే ఆలస్యంగా నిర్వహించాలని నిర్ణయించారని మోరీ చెప్పాడు. కరోనా వైరస్​ ప్రభావం ముగిస్తే వచ్చే ఏడాది ఒలింపిక్స్ నిర్వహించి విజయాన్ని ఘనంగా చాటాలని నిర్వాహక కమిటీ ఆలోచిస్తున్నది. అయితే వైరస్ తీవ్రత పెరుగుతుండడంతో 2021 జూలైలోనూ టోక్యో ఒలింపిక్స్ సాధ్యమవుతుందా అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. 


logo