మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 05, 2020 , 20:16:20

ఈ ఏడాది ఐపీఎల్​లో ఎన్నో సవాళ్లు: రైనా

ఈ  ఏడాది ఐపీఎల్​లో ఎన్నో సవాళ్లు: రైనా

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా మార్గదర్శకాలు, నిబంధనలు పాటిస్తూ ఈ ఏడాది ఐపీఎల్ ఆడడం ఆటగాళ్లకు కొత్త సవాలేనని టీమ్​ఇండియా సీనియర్ బ్యాట్స్​మన్, చెన్నై సూపర్​కింగ్స్ స్టార్ సురేశ్ రైనా అన్నాడు. అలాగే లాక్​డౌన్ కారణంగా నాలుగు నెలలు ఇంటికే పరిమితమైన నేపథ్యంలో ఫిట్​నెస్ కూడా కీలకంగా మారనుందని అన్నాడు. అన్ని విషయాలపై ముందుగానే స్పష్టత తెచ్చుకుంటే విజయవంతం కావొచ్చని బుధవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏదైమైనా ఐపీఎల్​ అందరినీ అలరిస్తుందని అన్నాడు.

“ఈ ఏడాది ఐపీఎల్ కోసం ఆటగాళ్లు ఎలా ఆలోచిస్తున్నారన్నది ఆసక్తికరం. ఈ ఏడాది విభిన్న పరిస్థితుల మధ్య ఆడాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో ఐసీసీ నిబంధనలు, ఎస్​వోపీ పాటిస్తూ ముందుకుసాగాలి. ఈ పరిస్థితుల్లో ఆడడం ఆటగాళ్లకు కొత్త సవాలే. అలాగే ఫిట్​నెస్ కూడా చాలా కీలకం కాబోతున్నది. దాదాపుగా ఐదు నెలలుగా ఇంటికే పరిమితమైన మేము మైదానంలో ఎలా ఆడుతామో చూడాలి. కరోనా పరీక్షలు ఐపీఎల్​కు ముందే జరిగితే ప్రశాంతమైన ఆలోచనలతో బరిలోకి దిగొచ్చు. ఏదేమైనా ఐపీఎల్ బెస్ట్​ స్పోర్ట్స్​ ఈవెంట్​గా ఉంటుంది. అందరూ ఆస్వాదిస్తారు” అని సురేశ్ రైనా అన్నాడు. కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ 13వ సీజన్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు జరుగనుంది. 


logo