గురువారం 09 ఏప్రిల్ 2020
Sports - Feb 01, 2020 , 01:13:20

స్పోర్ట్స్‌ కోడ్‌ను అమలు చేయండి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

 స్పోర్ట్స్‌ కోడ్‌ను అమలు చేయండి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: జాతీయ క్రీడా ప్రణాళిక-2011ను క్రీడాశాఖలో వెంటనే అమలు చేయాలని సాట్స్‌ చైర్మన్‌, ఎండీని రాష్ట్ర పర్యాటక, సాంస్మృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌  ఆదేశించారు. కేంద్ర క్రీడాశాఖ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్ర క్రీడాశాఖ ఆమోదం తెలుపుతూ జీవోను విడుదల చేసిందన్నారు. క్రీడా సంఘాల పాలన వ్యవహారాలను మెరుగుపరిచేందుకు మంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న వివిధ క్రీడా సంఘాల, సమాఖ్యల పనితీరుపై ఆయన చర్చించారు. స్పోర్ట్స్‌ కోడ్‌-2011ను అనుసరించి  క్రీడా సంఘాల్లో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి లాంటి పదవులకు 70 ఏండ్లలోపు ఉండాలని అధికారులకు సూచించారు. సంఘాల్లో  పరిపాలన వ్యవహారాలు, మెరుగైన పనితీరు, జవాబుదారీ తనం, పారదర్శకత ఉండేలా సంఘాలు పనిచేయాలని మంత్రి సూచించారు. సంఘాలకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలంటూ అధికారులను మంత్రి ఆదేశించారు. 


logo