ఆదివారం 05 జూలై 2020
Sports - Apr 27, 2020 , 10:26:45

నాతో నాకే పోటీ

నాతో నాకే పోటీ

న్యూఢిల్లీ: ప‌్ర‌తీ క్ష‌ణం మెరుగ‌య్యేందుకు క‌ష్ట‌ప‌డుతూ ఉంటాన‌ని టీమ్ఇండియా ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ పేర్కొన్నాడు. గ‌త‌ ప్ర‌ద‌ర్శ‌న‌ల కంటే మెరుగైన ఆట‌తీరు క‌న‌బ‌రిచేందుకు నిత్యం శ్ర‌మిస్తూ ఉంటానని అన్నాడు. చాంపియ‌న్స్ ట్రోఫీ అనంత‌రం ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌కు దూర‌మైన అశ్విన్ ప్ర‌స్తుతం టెస్టుల్లో మాత్ర‌మే కనిపిస్తున్నాడు. పాకిస్తాన్ మాజీ ఆట‌గాడు స‌క్ల‌యిన్ ముస్తాక్ ఇటీవ‌ల మాట్లాడుతూ.. భార‌త్‌లో అశ్వినే అత్యుత్త‌మ స్పిన్న‌ర్ అని.. అలాంటిది అత‌డిని జ‌ట్టులోకి ఎందుకు తీసుకోవ‌డం లేదో అని అన్న విష‌యం తెలిసిందే. 

తాజాగా అశ్విన్ మాట్లాడుతూ.. `గ‌తంలో నేను క‌న‌బ‌ర్చిన ప్ర‌ద‌ర్శ‌న‌ను మెరుగు ప‌రుచుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా పోరాడుతుంటా. స్వ‌దేశంతో పోల్చుకుంటే విదేశాల్లో అంత‌గా వికెట్లు తీయ‌లేక‌పోవ‌డంపై దృష్టి సారించా. ముఖ్యంగా ఇంగ్లండ్ వంటి పిచ్‌ల‌పై ప్ర‌భావం చూపాల‌ని భావిస్తున్నా. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ల‌క్ష్యాలు పెట్టుకుంటూ ముందుకు సాగుతా. అయితే ఈ క్ర‌మంలో గ‌త ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను అధిగ‌మించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంటా` అని చెప్పాడు.  క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కార‌ణంగా ఐపీఎల్‌-13వ సీజ‌న్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ‌టంతో ఆట‌గాళ్లంతా ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు.


logo