ఓపెనింగ్ చాన్స్ వస్తే.. అదృష్టంగా భావిస్తా: సుందర్

న్యూఢిల్లీ: టీమ్ఇండియా హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఇచ్చే సలహాలు యువ ఆటగాళ్లలో స్ఫూర్తినింపుతాయని.. గ్రౌండ్లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు టానిక్‌లా పనిచేస్తాయని భారత యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అన్నాడు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన 21 ఏండ్ల సుందర్ ఆదివారం మాట్లాడుతూ.. ‘ఆటలో చాలెంజ్‌లు స్వీకరించేందుకు సదా సిద్ధంగా ఉంటా. టెస్టుల్లో ఓపెనింగ్ చేసే అవకాశం వస్తే దాన్ని అదృష్టంగా భావిస్తా. నాలాంటి యువ ఆటగాళ్లకు రవిశాస్త్రి వంటి అనుభవజ్ఞుడు కోచ్‌గా లభించడం ఎంతో మేలు చేస్తున్నది. ఆల్‌రౌండర్‌గా రాణించాలనుకుంటున్న నాకు రవి సార్ సలహాలు చాలా ఉపయోగపడుతున్నాయి’ అని అన్నాడు. స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన రవిశాస్త్రి టెస్టు క్రికెట్లో ఓపెనర్‌గా ఎదిగినట్లు తాను కూడా సుదీర్ఘ కాలం పాటు భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నట్లు సుందర్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
- మేళాలతో యువత ఉపాధి పొందాలి
- హైటెక్స్‌లో.. ఎక్స్పో
- ఆమె శక్తి..విశ్వవ్యాప్తి
- అన్నివర్గాలకు సముచిత స్థానం కల్పించాం
- కీసరగుట్టకు ప్రత్యేక బస్సులు
- విద్యుత్ సమస్యలకు చెక్
- చిరు వ్యాపారులకు వడ్డీ మాఫీ
- బీజేపీకి గుణపాఠం తప్పదు
- టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలికి భారీ మెజార్టీతో గెలిపించండి..
- సంఘటితంగా కృషి చేయాలి