గురువారం 16 జూలై 2020
Sports - Apr 21, 2020 , 10:28:17

ఐపీఎల్ ర‌ద్ద‌యితే.. రూ.5వేల కోట్ల నష్టం

ఐపీఎల్ ర‌ద్ద‌యితే.. రూ.5వేల కోట్ల నష్టం

ముంబై: క‌రోనా ఎఫెక్ట్ అన్ని రంగాల‌పై ప‌డింది. ముఖ్యంగా క్రీడా టోర్నీలు కూడా కొన్ని వాయిదా ప‌డ‌గా, మ‌రికొన్ని ర‌ద్ద‌య్యాయి. దీని వ‌ల్ల‌ కీడా సంఘాలు, లీగులు, జట్లు ఆర్థికంగా చాలా నష్టపోయాయి.  ఈ క్ర‌మంలోనే ఐపీఎల్‌పైనా క‌రోనా ఎఫెక్ట్ ప‌డింది. ఇప్పటికే ఈ టోర్నీని నిర‌వ‌ధికంగా వాయిదా వేయ‌గా..రాబోయే రోజుల్లోకూడా జ‌ర‌గ‌డం  క‌ష్టంగానే ఉన్న‌ది. ఒకవేళ టోర్నీ రద్దయితే బీసీసీఐ, ఫ్రాంఛైజీలకు రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా. బీసీసీఐతో పాటు ఐపీఎల్‌ జట్లకు కూడా కరోనా మహమ్మారికి వర్తించే బీమా లేక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. బీసీసీఐ సంప్రదించే సమయానికే ఇన్సూరెన్స్‌ కంపెనీ తమ కవరేజీ క్లాజ్‌ నుంచి కరోనా మహమ్మారిని తొలగించిందని చెప్పింది. 

ఇది ఐపీఎల్ జట్లకు సంబంధించి ఇన్సూరెన్స్ డీల్స్ చూస్తుంది. బీమా సంస్థలు నిబంధనలు మార్చివేయడంతో కరోనా కారణంగా టోర్నీ రద్దైతే బీమా సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. క‌రోనా మహమ్మారి కారణంగా టోర్నమెంట్‌ రద్దయితే ఇన్సూరెన్స్‌ కింద డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా బీమా కంపెనీలు నిబంధనలు మార్చాయి. బీసీసీఐలా కాకుండా కొన్ని టోర్నీల నిర్వాహకులు మాత్రం ముందు చూపుతో వ్యవహరించారు. వింబుల్డన్ వంటి టోర్నీల నిర్వాహకులు మాత్రం స‌రైన ప్లాన్‌తో వ్యవహరించారు. మహమ్మారుల కారణంగా టోర్నీలు రద్దు అయినా బీమా వర్తించేలా ఇన్సూరెన్స్ చేయించారు. ఫలితంగా ఆయా టోర్నీల నిర్వాహకులు సేఫ్ అయ్యారు.


logo