సోమవారం 18 జనవరి 2021
Sports - Nov 24, 2020 , 13:38:34

వ‌న్డేల్లో గెల‌వ‌క‌పోతే.. టెస్టులు వైట్‌వాషే!

వ‌న్డేల్లో గెల‌వ‌క‌పోతే.. టెస్టులు వైట్‌వాషే!

సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిరీస్‌కు సిద్ధ‌మ‌వుతున్న టీమిండియాకు ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఓ హెచ్చ‌రిక జారీ చేశాడు. టీమిండియా క‌చ్చితంగా వ‌న్డే, టీ20 సిరీస్‌లు గెల‌వాల‌ని, లేదంటే టెస్ట్ సిరీస్‌లో 0-4తో వైట్‌వాష్ త‌ప్ప‌ద‌ని క్లార్క్ అంటున్నాడు. ఈ వ‌న్డేలు, టీ20ల్లోనే విరాట్ కోహ్లి టీమ్‌ను ముందుండి న‌డిపించ‌గ‌ల‌డు. ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో టీమ్‌ను గెలిపించి తొలి టెస్ట్ త‌ర్వాత అత‌ను వెళ్లిపోతే మిగ‌తా టెస్ట్ సిరీస్‌లో టీమ్ మంచి ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గ‌ల‌దు. వ‌న్డేలు, టీ20లు గెల‌వ‌క‌పోతే టెస్టుల్లో ఒక్క మ్యాచ్ కూడా టీమిండియా గెల‌వ‌లేదు అని క్లార్క్ స్ప‌ష్టం చేశాడు. ఇక పేస‌ర్ బుమ్రా కూడా టీమిండియా విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించ‌నున్నాడని అత‌డు అభిప్రాయ‌ప‌డ్డాడు. అత‌డు చాలా వేగంగా బౌలింగ్ చేస్తాడు. అత‌ని యాక్ష‌న్ కూడా భిన్నంగా ఉంటుంది. ఆస్ట్రేలియా బ్యాట‌ర్ల‌పై చాలా దూకుడుగా బౌలింగ్ చేయాలి. స్టీవ్ స్మిత్‌లాంటి బ్యాట్స్‌మ‌న్‌కు కూడా షార్ట్ బాల్ వేయాలి. యాషెస్‌లో జోఫ్రా ఆర్చ‌ర్.. స్మిత్‌కు ఎలా బౌలింగ్ చేశాడో బుమ్రా కూడా అలా చేయాల‌ని క్లార్క్ సూచించాడు.