గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Jan 26, 2021 , 16:56:10

బుద్ధిలేనోడే ఆ ఆల్‌రౌండర్‌కు రూ.10కోట్లు చెల్లిస్తారు!

బుద్ధిలేనోడే ఆ ఆల్‌రౌండర్‌కు  రూ.10కోట్లు చెల్లిస్తారు!

న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌-2021 ఆటగాళ్ల వేలం జరగనున్న నేపథ్యంలో  ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌పై న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్ స్కాట్‌ స్టైరీస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.  వేలంలో మాక్స్‌వెల్‌కు ఎవరైనా రూ.10కోట్లు వెచ్చించాలనుకుంటే  అది మూర్ఖపు నిర్ణయం అవుతుందని స్టైరీస్‌ వ్యాఖ్యానించారు.  గత ఐదు లేదా ఆరు  ఐపీఎల్‌   సీజన్లలో మాక్స్‌వెల్‌ ప్రదర్శన దారుణంగా ఉందని   స్కాట్  తెలిపారు.  32ఏండ్ల మాక్స్‌వెల్‌ను కనీస ధరకే కొనుగోలు చేయడం ఉత్తమమని సలహా ఇచ్చాడు. 

'ఎవరైనా మాక్స్‌వెల్‌ కోసం కొంచెం అటు ఇటు రూ.10కోట్లు చెల్లిస్తే వాళ్లకు బుర్రలేదనే అనుకుంటా.  అతను ఎంత మంచి ఆటగాడో మనందరికీ తెలుసు. ఇక్కడ ప్రశ్న అదికాదు. అతనిలో ప్రతిభ ఉంది. కానీ, తన స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోతున్నాడని' స్టార్‌స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌తో ఇంటర్వ్యూలో స్టైరీస్‌ పేర్కొన్నారు. 

గతేడాది సీజన్‌లో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ తరపున ఆడిన మాక్స్‌వెల్‌  13 మ్యాచ్‌ల్లో   కేవలం 108 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అంచనాలకు తగ్గట్టుగా రాణించకపోవడంతో  పంజాబ్‌ ఫ్రాంఛైజీ అతన్ని వదులుకున్నది.  గత కొన్ని సీజన్లలో మాక్స్‌వెల్‌ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి.  భారీ ధరకు అమ్ముడుపోతున్న  మాక్సీ  ఏ జట్టుకు  పూర్తి న్యాయం చేయలేకపోవడంతో స్టైరీస్‌ ఈ విధంగా స్పందించాడు.  ఐపీఎల్‌-2020 వేలంలో ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ కోసం రూ.10.75 కోట్లకు పంజాబ్‌ దక్కించుకున్నది.  


VIDEOS

logo