శనివారం 04 జూలై 2020
Sports - Apr 13, 2020 , 20:52:41

బోర్డు సపోర్ట్ ఉంటే రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేవాడిని: క‌నేరియా

బోర్డు సపోర్ట్ ఉంటే రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేవాడిని: క‌నేరియా

లాహోర్‌: త‌మ దేశ క్రికెట్ బోర్డు నుంచి స‌రైన మ‌ద్ధ‌తు ల‌భిస్తే.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు తిరుగ‌రాసేవాడిన‌ని పాకిస్థాన్ మాజీ లెగ్‌స్పిన్న‌ర్ దానిశ్ క‌నేరియా అన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌ల‌తో జీవిత‌కాల నిషేధం ఎదుర్కొంటున్న ఈ బౌల‌ర్‌.. ఇటీవ‌ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. 

పీసీబీ ఎప్పుడూ త‌న‌కు త‌గిన ప్రాధాన్య‌త క‌ల్పించ‌లేద‌ని.. పాక్ జ‌ట్టులో మ‌త‌ప‌ర‌మైన వివ‌క్ష ఉండేద‌ని.. ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్న క‌నేరియా.. తాజాగా బోర్డు త‌న‌కు తగినంత మ‌ద్ద‌తు ఇవ్వ‌లేద‌ని పేర్కొన్నాడు. విండీస్ దిగ్గ‌జం బ్రియాన్ లారాను ఐదు సార్లు ఔట్ చేసిన త‌న‌కు.. కాస్త స‌పోర్ట్ ల‌భించి ఉంటే.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేవాడిన‌ని ఓ యూట్యూబ్ వీడియోలో క‌నేరియా చెప్పుకొచ్చాడు.


logo