శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Sep 06, 2020 , 14:58:48

ధోని లేక‌పోతే సీఎస్‌కే ప‌రిస్థితి ఏంటి!?

ధోని లేక‌పోతే సీఎస్‌కే ప‌రిస్థితి ఏంటి!?

ఎంఎస్ ధోని నేతృత్వంలో సీఎస్‌కే ఇప్ప‌టికి మూడుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్ప‌డు 2020 సీజ‌న్ కోసం యూఏఈలో ప్రాక్టీస్ మొద‌లు పెట్టింది. కొంత‌మంది జ‌ట్టు స‌భ్యుల‌కు క‌రోనా సోకినా.. రైనా, హ‌ర్భ‌జ‌న్ సింగ్ జ‌ట్టుతో లేక‌పోయినా.. ఇబ్బందులతో సంబంధం లేకుండా కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రం పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. ధోని ఉన్నంత‌వ‌ర‌కు త‌న‌కు ఎలాంటి టెన్ష‌న్ లేద‌ని ఇటీవ‌ల జ‌ట్టు య‌జ‌మాని శ్రీ‌నివాస‌న్ కూడా ప్ర‌క‌టించారు. 

అయితే ధోని లేక‌పోతే సీఎస్‌కే ప‌రిస్థితి ఏంటనేదే ప్ర‌శ్న‌గా మిగిలిపోయింది. ఏదో ఒక‌రోజు ధోని ఐపీఎల్‌కూ రిటైర్మెంట్ ప్ర‌క‌టించాల్సిందే. అప్ప‌డు ఏం జ‌రుగుతుంది.? ఇదే విష‌య‌మై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో మాట్లాడాడు. "ధోని లేక‌పోతే సీఎస్‌కే స‌గం అవుతుంది. జ‌ట్టు స‌మ‌స్య‌ల్లో ప‌డుతుంది." అని ఆకాశ్ అన్నాడు. 

"ఏదో ఒక రోజు ధోని సీఎస్‌కేకు కూడా రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తాడు. అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ భారీ నష్టాన్ని చవిచూస్తుంది. ఎందుకంటే ఆ జట్టును ధోని న‌డిపించే విధానం అలాంటిది. అత‌డిలా జ‌ట్టును న‌డిపే వారు ఉండ‌ర‌ని నా అభిప్రాయం" అని చోప్రా అన్నాడు. "సీఎస్‌కేకు త‌రువాత ఎవ‌రు కెప్టెన్ అయినా.. ధోనీలా జ‌ట్టును న‌డ‌ప‌లేర‌ని నేను అనుకుంటున్నా. అయితే కెప్టెన్‌గా రాజీనామా చేసినా.. ధోని జ‌ట్టులో ఏదో ఒక ప‌ద‌విలో.. బ్రాండ్ అంబాసిడర్‌గా, గురువుగా ఉండి చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు మ‌ద్ద‌తుగా ఉంటాడ‌ని నేను భావిస్తున్నా. ఎందుకంటే ధోనికి, సీఎస్‌కేకు ఉన్న బంధం అలాంటిది." అని చోప్రా చెప్పాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo